Share News

kumaram bheem asifabad- ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:16 PM

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదు అవుతున్నదని, వరి వేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, వ్యవసాయ, నీటి పారుదల, వాతావరణ శాఖల అధికారులతో కలిసి గురువారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, జిల్లా అధికారులు

ఆసిఫాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదు అవుతున్నదని, వరి వేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, వ్యవసాయ, నీటి పారుదల, వాతావరణ శాఖల అధికారులతో కలిసి గురువారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ ఎల్‌నినో ప్రభావం వర్షకాలంలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులలో పూర్తి స్థాయి నీరు రాక పోవచ్చని, వరి పంట సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలు సాగు చేసుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లలో నీటి మద్టంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని అన్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని సూచించారు. నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ కె.భారతి, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు అయిందని చెప్పారు. ప్రాజెక్టులు, చెరువుల కింద వరి సాగు చేసే రైతులను వరికి బదులు పప్పు ధాన్యాలు, ఆయిల్‌ పామ్‌ ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులను నీటి నిలువలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Jul 09 , 2026 | 10:16 PM