Share News

సిరిసిల్లలో గాలివాన

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:43 AM

మృగశిర కార్తెను స్వాగతిస్తూ ఆదివారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ బోయి న్‌పల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన

సిరిసిల్లలో గాలివాన
బోయిన్‌పల్లి వద్ద రోడ్డుపై విరిగి పడ్డ చెట్టు

సిరిసిల్ల, జూన్‌ 7 (ఆంరఽధజ్యోతి): మృగశిర కార్తెను స్వాగతిస్తూ ఆదివారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ బోయి న్‌పల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో చల్లటి గాలి వేడి నుంచి ఆహ్లాదం కలిగించింది. మరో వైపు గాలి బీభత్సం చెట్లను నేల కూల్చింది. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై గాలికి భారీ వృక్షం నేల కూలింది. బోయిన్‌పల్లిలో పలు గ్రామాల్లో గాలి బీభత్సానికి చెట్లు విరిగి పోవడంతో పాటు ఇళ్లపై ఉన్న రేకుల పైకప్పులు కొట్టుకు పోయాయి.

వేములవాడ రూరల్‌: వేములవాడ రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. మండలంలోని నాగయ్యపల్లె నుండి మర్రిపల్లి వెళ్లే కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయా ణికులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వేములవాడ రూరల్‌ ఎస్సై వెంకట్రాజం ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో రహ దారికి అడ్డంగా పడిన చెట్లను తొలగించారు.

బోయినపల్లి : మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొదురుపాక, నీలోజుపల్లి, వెంకట్రావుపల్లి, కొత్తపేట తదితర గ్రామాల్లో పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొత్తపేట వెంకట్రా వుపల్లి గ్రామాల మధ్య వృక్షం విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల ముందు ఉన్న రేకులు పైకి లేచిపోయాయి, చెట్లు సైతం విరిగిపోయాయి. నీలోజుపల్లి గ్రామంలోని కుసు రవీందర్‌ చెందిన ప్లాస్టిక్‌ ఇండస్ట్రీ పైకప్పు లేచిపోయింది.

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ఆదివారం రాత్రి ఉరువులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఆయా గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల పాటు ప్రజలు చీకట్లోనే కాలం వెళ్లదీశారు. సంబంధిత శాఖ అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు.

Updated Date - Jun 08 , 2026 | 12:43 AM