రాహుల్‌గాంధీ అరెస్టు అప్రజాస్వామికం
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:36 PM
రాహుల్‌గాంధీ అరెస్టు అప్రజా స్వామికమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. రాహుల్‌గాంధీ అక్ర మ అరెస్టును నిరసిస్తూ శనివారం పట్టణంలోని అంబేద్కర్ కాంటా చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
బెల్లంపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాహుల్‌గాంధీ అరెస్టు అప్రజా స్వామికమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. రాహుల్‌గాంధీ అక్ర మ అరెస్టును నిరసిస్తూ శనివారం పట్టణంలోని అంబేద్కర్ కాంటా చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ శాంతియుతంగా మార్చ్ నిర్వహించినందుకు రాహుల్‌గాంధీని అక్రమంగా అ రెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని తొక్కేయడమేనని పేర్కొన్నారు. ఆయన తో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్‌తో పాటు 260 మం దిని అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య అన్నారు. బీజేపీకి వత్తాసు పలుకుతున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు.
సర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఓ టర్ల నమోదు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు పి న్నింటి రగునాధ్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బండి ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, టీపీసీసీ మెంబర్ చిలుముల శంకర్, కౌన్సిలర్లువ సం త, కల్పన, శ్రావణ్, వంశీ, శంకర్‌సింగ్, కాంగ్రెస్ నాయ కులు చిన్నరాజం, రాజలింగు, శ్రీ నివాస్, మధు, వెంకటేష్, శంకర్, రమేష్, రాజేష్, వెంకటస్వామి, భరత్, సతీష్ పాల్గొన్నారు.