Share News

రాజ్యసభ అభ్యర్థులపై రేపు నిర్ణయం!

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:24 AM

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం తేల్చనుంది.

రాజ్యసభ అభ్యర్థులపై రేపు నిర్ణయం!

  • ప్రతిపాదనలతో ఢిల్లీకి రావాలని సీఎంకు రాహుల్‌గాంధీ సూచన

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం తేల్చనుంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌లకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. శంషాబాద్‌ విమానాశ్రయం లాంజ్‌లో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌, మహే్‌షకుమార్‌గౌడ్‌లు సోమవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అయితే, ఒక స్థానంలో అభిషేక్‌ మను సింఘ్వీనే తిరిగి పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రెండో సీటు ఎవరికి ఇవ్వాలనేది బుధవారం తేలే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌లు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం హోళీ శుభాకాంక్షలు

హోళీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో, కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటేలా జరుపుకోవాలన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 03:24 AM