Share News

క్రీడా శక్తిగా భారత్‌: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:02 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు.

క్రీడా శక్తిగా భారత్‌: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు. న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి రఘునందన్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గత పదేళ్లలో మోదీ దేశంలో క్రీడా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షి్‌పకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 03:02 AM