Share News

వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి : రఘునందన్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:24 AM

డ్రగ్స్‌ పార్టీలో ఈగల్‌ టీంపై కాల్పులకు తెగబడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి : రఘునందన్‌

గజ్వేల్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ పార్టీలో ఈగల్‌ టీంపై కాల్పులకు తెగబడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫాంహౌస్‌లు, క్లబ్‌హౌస్‌ల పేరిట మాజీ ప్రజాప్రతినిధులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సమాజానికి ఆదర్శంగా, భావితరానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్‌, గంజాయికి బానిసలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు.

Updated Date - Mar 16 , 2026 | 04:24 AM