Share News

మోదీని విమర్శిస్తే బీసీల తిరుగుబాటు తప్పదు

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:39 AM

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడంతో ఇండియా కూటమి, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు.

మోదీని విమర్శిస్తే బీసీల తిరుగుబాటు తప్పదు

  • రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడంతో ఇండియా కూటమి, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు. మోదీని విమర్శిస్తే కబడ్దార్‌.. ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమిపై బీసీల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని, కుల గణన చేపడుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు ఆయనపై విమర్శలు చేస్తున్నాయని ఆర్‌. కృష్ణయ్య ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో 14 బీసీ సంఘాల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతేఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 20 , 2026 | 05:39 AM