ఫీజులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి: కృష్ణయ్య
ABN , Publish Date - May 04 , 2026 | 04:41 AM
రూ.10వేల కోట్ల మేరకు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను.. తక్షణమే విడుదల చేయకపోతే..
బర్కత్‌పుర, మే 3 (ఆంధ్రజ్యోతి): రూ.10వేల కోట్ల మేరకు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను.. తక్షణమే విడుదల చేయకపోతే.. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని 5లక్షల మంది విద్యార్థులతో ముట్టడిస్తామని ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. 30 నెలలుగా వీటిని చెల్లించకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బీసీ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 14లక్షల మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా.. రూ.వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గత కాంగ్రెస్ సీఎం వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తేగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు దీన్ని ఎత్తేసేందుకు కుట్ర చేస్తోందని, అదే జరిగితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చుతామన్నారు.