బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:28 AM
బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు...
జాతీయ గురుకులాలు స్థాపించాలి.. 56ుకు రిజర్వేషన్లు పెంచాలి
చట్టసభల్లో 50ు రిజర్వేషన్లకు బీసీ బిల్లు ఆమోదించాలి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో గురుకులాలను స్థాపించడంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కార్యాలయంలో శుక్రవారం ఆయనతో ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 27ు నుంచి 56 శాతానికి పెంచడంతోపాటు ఆయా రంగాల్లో క్రిమీ లేయర్‌ను తొలగించాలని అభ్యర్థించారు. ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగ సవరణ చేయాలని సూచించిన ఆర్.కృష్ణయ్య.. ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. షరతులు సడలించి జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కుల వృత్తుల వారికి సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని కోరారు. ఒక్కో కుటుంబానికి 80ు సబ్సిడీతో రూ.20 లక్షల రుణాలివ్వాలని మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. అలాగే పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించి.. చట్టసభల్లో బీసీలకు 50ు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.