బీసీ హాస్టళ్లు, గురుకులాలు మంజూరు చేయాలి
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:09 AM
బీసీ విద్యార్థుల కోసం కొత్తగా 120 బీసీ కాలేజీ హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎంపీ ఆర్.కృష్ణయ్య వినతి
రాంనగర్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): బీసీ విద్యార్థుల కోసం కొత్తగా 120 బీసీ కాలేజీ హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో హాస్టళ్లు, గురుకులాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బీసీ భవన్‌లో ఆయన విలేకరుతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బీసీ కాలేజీ హాస్టళ్లు విద్యార్థులకు సరిపోవడం లేదన్నారు. ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకోవాల్సి రావడంతో బీసీ వర్గాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు.