Share News

kumaram bheem asifabad- సమస్యలపై నిలదీత

ABN , Publish Date - Nov 03 , 2026 | 10:31 PM

మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీవో ఖాజా అజీజుద్దీన్‌ అధ్యక్షతన మండల సమావేశంలో సభ్యులు సమస్యలపై నిలదీశారు. వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి నిర్లక్ష్యం వల్ల వైద్య సిబ్బంది ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని రోగులను పట్టించుకోవడంలేదని బంబార సర్పంచ్‌ కృష్ణాజీతో పాటు పలు వురు సర్పంచ్‌లు ఆరోపించారు. అనారోగ్య కారాణాలతో వైద్యశాలకు వెళ్తే వైద్యాధికారి పరీక్షించకుండా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు రోగులను అంటిమూట్టనట్లు చూసి కనీసం మాత్రలు సూదులు ఇవ్వకుండా ఆసిపాబాద్‌కు, బయట ఆసుపత్రుల్లో చూపించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు.

kumaram bheem asifabad- సమస్యలపై నిలదీత
మాట్లాడుతున్న ఎంపీవో ఖాజా అజీజుద్దీన్‌

వాంకిడి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీవో ఖాజా అజీజుద్దీన్‌ అధ్యక్షతన మండల సమావేశంలో సభ్యులు సమస్యలపై నిలదీశారు. వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి నిర్లక్ష్యం వల్ల వైద్య సిబ్బంది ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని రోగులను పట్టించుకోవడంలేదని బంబార సర్పంచ్‌ కృష్ణాజీతో పాటు పలు వురు సర్పంచ్‌లు ఆరోపించారు. అనారోగ్య కారాణాలతో వైద్యశాలకు వెళ్తే వైద్యాధికారి పరీక్షించకుండా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు రోగులను అంటిమూట్టనట్లు చూసి కనీసం మాత్రలు సూదులు ఇవ్వకుండా ఆసిపాబాద్‌కు, బయట ఆసుపత్రుల్లో చూపించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎలర్జీ దురద కావడంతో తానే స్వయంగా వైద్యశాలకు వెళితే అక్కడున్న సిబ్బంది బయట పరీక్షించకుండా ఎలాంటి మాత్రలు, సూది ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించారని అనంతరం ఆర్‌ఎంసీ వైద్యుని వద్ద చికిత్స చేయించాల్సి వచ్చిందని బంబార సర్పంచ్‌ ఆరోపించారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇనుప విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగి, విద్యుత్‌ తీగలు వేలాడుతున్న విషయాన్ని గత మండల సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని సర్పంచ్‌లు ఆరోపించారు. పిప్పర్‌గోంది గ్రామంలో మహిళ సంఘం భవన నిర్మాణానికి ఆటవిశాఖ అనుమతులు లేవంటు పనులను అడ్డుకుంటున్నారని సర్పంచ్‌ గులాబ్‌ చెప్పారు. మహిళా సంఘ భవనాలను అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గోండ్‌కోసార గ్రామానికి వెళ్లే రహదారికి అడ్డంగా ప్రవాహిస్తున్న వాగుపై మంజూరైన వంతెన నిర్మాణాన్ని ఆటవిశాఖ అధికారులు అడ్డుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బంబార సర్పంచ్‌ కృష్ణాజీ చెప్పారు. అధికారులు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పలు గ్రామాల్లో మిషన్‌భగీరథ నీటి సరఫరా సక్ర మంగా జరుగడంలేదని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కోరారు. మండల సమావేశంలో సర్పంచులు లెవనెత్తిన ప్రతి అంశాన్ని మినట్స్‌లో రాసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి సమస్యల పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీవో ఖాజా అజీజుద్దీన్‌ తెలిపారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేసిన ప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సమావేశానికి పూర్తి స్థాయిలో అధికారులు హాజరుకాకపోతే సభ్యులు తమ సమస్యలను ఎవరికి వినిపించాలని ప్రశ్నించారు. వచ్చే సమా వేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలని ఎంపీవోను కోరారు. సమావేశంలో ఏవో గోపికాంత్‌, సీడీసీవో విజయలక్ష్మి, ఏటీడబ్ల్యూఓ చిరంజీవి, ఈజీఎస్‌ ఈసీ మోసిన్‌, పీఆర్‌ ఏఈ కిరణ్‌, హౌసింగ్‌ ఏఈ నాగరాజు, ఎప్‌ఎస్‌వో మల్లయ్య, ఎఫ్‌బీవో ప్రకాష్‌, మిషన్‌భగరత ఏఈ వెంకటేష్‌, ఏఈ ఇరిగేషన్‌ శివకుమార్‌, ఎంఈవో శివచరణ్‌కుమార్‌, ఐకేపీ ఏపీఎం కోనయ్య, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 10:31 PM