Share News

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:41 PM

సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పై ప్రత్యేక డ్రైవ్‌ సమర్థవంతంగా అమలు చేయాలని, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సూచించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
నస్పూర్‌ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో బియ్యంను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

కస్తూర్భా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

నస్పూర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పై ప్రత్యేక డ్రైవ్‌ సమర్థవంతంగా అమలు చేయాలని, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సూచించారు. నస్పూర్‌ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సోమవారం తనిఖీ చేశారు. విద్యాలయంలో వంట శాల, ఆహార పదార్థాలు పరిశీలించి విద్యార్థులకు అందుతున్న నాణ్యతను పరిశీ లించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మా ట్లాడారు. చదువు, వసతి, ఆహారం లాంటి అంశాలపై విద్యార్థు లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే ఆహార పధార్థాలు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. శుభ్రతతో కూడిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వాల న్నారు. పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ద్య సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో కొనసాగు తున్న నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో మండల విద్యాధికారి పద్మజా, సంబందిత అధికారులు, విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 11:41 PM