రైతుకు నాణ్యమైన విత్తనాలను అందించాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:34 PM
రైతులకు నమ్మక మైన అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అం దించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మం దిరంలో విత్తనాల డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధు లతో సమావేశం నిర్వహించారు.
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రైతులకు నమ్మక మైన అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అం దించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మం దిరంలో విత్తనాల డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధు లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రై తులు కల్తీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ పరిస్థితుల్లో వారికి నాణ్యమైన వినియోగం వైపు మళ్లిం చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వరి సాగు మా త్ర టమే కాకుండా రైతులు లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజ న్‌లో విత్తనాల కొరత లేదన్నారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలను మాత్రమే డీలర్లు విక్రయించాలన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా వ్యవసాయ శాఖ తగిన చర్య లు తీసుకోవాలని తెలిపారు. పంటల సాగులో అవసరమైన మెలకువులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సురేఖ , అధికారులు పాల్గొన్నారు.