విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:36 AM
విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయు లు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్లి కూరగాయాలు,
వేములవాడ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయు లు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్లి కూరగాయాలు, పండ్లు, కోడి గుడ్లు, పప్పులు, బియ్యం, నాణ్యతను తనిఖీ చేసి, గడువు తేదీని పరిశీలించారు. మునూ చార్ట్ ప్రకారం ఈ రోజు ఏఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా వారితో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అంది స్తున్నారా.. అంటూ ఆరా తీశారు. ఇంటర్ సెకంట్ ఇయర్ సీఈసీ విద్యార్థులు భవిష్యత్ ప్రణాళి కలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యా ర్థులకు ఖచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే అన్ని పాఠ్యాంశాల ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ చూసుకోవాలని సూచించారు.
ఎయిడ్స్ నియంత్రణపై ప్రచారం కల్పించాలి
సిరిసిల్ల అర్బన్ : ఎయిడ్స్ నియంత్రపై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యం లో చేపట్టిన అవగహన ర్యాలీ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1097, క్యూఆర్‌కోడ్‌లతో రూపొందించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. కలెక్టరేట్ నుంచి మొదలైన ర్యాలీ సిరిసిల్ల పట్టణంలోని నేతన్నచౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, గాంఽధీచౌక్, మానేరు వంతెన వరకు చేరుకుని తిరిగి జిల్లా కలెక్టరేట్ వద్ద ముగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్ధాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎంజెలా అల్ర్పెడ్, జిల్లా విద్యాధికారి మొండయ్య పాల్గొన్నారు.