విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Aug 16 , 2026 | 10:57 PM
ప్రభుత్వ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థులకు అల్పాహారంతో పాటు నాణ్యమైన భోజనం అందించేం దుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, ఆగస్టు16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థులకు అల్పాహారంతో పాటు నాణ్యమైన భోజనం అందించేం దుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణం కాలేజీరోడ్డులో ఏర్పాటు చే స్తున్న కేంద్రీకృత వంటశాల పనులను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ ఫ లాలు అందుతున్నాయన్నారు. విద్యార్థులకు అల్పాహారంతో పాటు నాణ్య మై న భోజన వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. దసరా నుంచి అల్పాహారం ఇక్కడి నుంచే పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా అధికారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ మధూకర్, నాయకులు గడ్డం త్రిమూర్తి, సయ్యద్ షాహిద్ అలీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.