నాణ్యతగా ఇళ్లు నిర్మించుకోవాలి
ABN , Publish Date - May 02 , 2026 | 11:29 PM
ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకా రం ఉంటుందని, నాణ్యతతో ఇళ్ల ని ర్మాణ పనులు పూర్తి చేయాలని క లెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు.
- ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్/ తాడూరు, మే 2 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకా రం ఉంటుందని, నాణ్యతతో ఇళ్ల ని ర్మాణ పనులు పూర్తి చేయాలని క లెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు. శనివారం మండల కేంద్రం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ను పరిశీలించారు. ఇటీవల గృహ ప్రవేశం చేసిన లక్ష్మి అనే లబ్ధిదారు లు ఇల్లు, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న కమలమ్మ అనే లబ్ధిదారులి ఇం టిని పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, సదుపా యాలు, ప్రభుత్వ సహాయం, వినియోగం త దితర అంశా లపై కలెక్టర్ ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల స్వగృహ కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. లబ్ధి దారులు పనులను వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు. మం డలంలోని ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై హౌసింగ్ పీడీ, కలెక్టర్‌కు వివరించారు. తాడూరు పరిధి లో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన 104 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలిం చా రు. ఈ కార్య క్రమంలో హౌసింగ్ పీడీ సంగప్ప, స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజనీరింగ్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, గ్రామస్థాయి అధికా రులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
రుచికరమైన భోజనం అందుతుందా?
-ఇందిరమ్మ క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
కలెక్టరేట్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి ఇందిరమ్మ క్యాంటీ న్‌ను శనివారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. క్యాంటీన్‌లో వంటకాలు తయా రు చేసే విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ఆ హార పదార్థాల నాణ్యతను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి ప్రతీ రోజు భోజనం సమయానికి అందుతుందా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణలో పారదర్శకత పాటించి, మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్య లు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.