Share News

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:31 AM

గురుకుల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్య అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన ప్రజావాణిలో సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాయలంలో

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

సిరిసిల్ల అర్బన్‌, జూలై 27 (ఆంఽధ్రజ్యోతి): గురుకుల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్య అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన ప్రజావాణిలో సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాయలంలో సరైన వసతుల లేవని, భోజనంలో నాణ్యత లోపించిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అర గంటలోనే చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ నేరుగా భోజన శాలకువెళ్లి భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, నూనె ఇతర ఆహార పదార్ధాల నాణ్యత, గడువు తేదీలను తనీఖీలు చేశారు. అక్కడి నుంచి విద్యార్థుల వసతి గదులకు వెళ్లి మరుగుదొడ్లను పరిశీలించారు. విదార్ధుఽలతో మాట్లాడి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలతో పాటు నీటి సరఫరా వెంటనే పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లాలోని వేములవాడ మహ్మాతా జ్యోతిబాపూలే బాలుర గురుకుల రెసిడెన్షియల్‌ విద్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఇటీవల తఖీలు చేసి నిర్వహణలో లోపాలను గుర్తించారు. విచారణ నివేదక అధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నబోనాల గురుకుల విద్యాయలం ప్రిన్సిపాల్‌ను అదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యాయలం అవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రతి పాఠ్యాంశం కీలకమని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని సూచించారు. వసతులను సద్వినియోగం చేసుకుని విద్యాలో రాణించాలని అకాంక్షించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలపై అవగహన కలిగి ఉండాలని సూచించారు.

Updated Date - Jul 28 , 2026 | 12:31 AM