Share News

ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:29 PM

ప్రజలకు నాణ్య మైన నేత్ర వైద్య సేవలు అందిం చడంలో తూడుకుర్తిలోని కూచకు ళ్ల రామచంద్రారెడ్డి ఐసెంటర్‌ ముం దు వరుసలో ఉందనిఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి అన్నారు.

ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి

- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు నాణ్య మైన నేత్ర వైద్య సేవలు అందిం చడంలో తూడుకుర్తిలోని కూచకు ళ్ల రామచంద్రారెడ్డి ఐసెంటర్‌ ముం దు వరుసలో ఉందనిఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి అన్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ భాగస్వామ్యం తో అహర్నిషలు అందిస్తోందని తెలిపారు. నాగ ర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తిలో శనివారం ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు అనుబంధం నిర్వహిస్తున్న కూచకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్‌ 28వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హేమంత కేశ వ్‌ పాటిల్‌తో కలిసి ఎమ్మెల్సీ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీ ణ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్రదానం అం దించేందుకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి చూపిన చొరవతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవ లు అందుతున్నాయని కొనియాడారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగిని ఎంపిక చేసి నగ దు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అంద జేశారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ మునిసి పల్‌ చైర్మన్‌ తీగలసునేంద్ర, తహసీల్దార్‌ తబితా రాణి, గ్రామ సర్పంచ్‌ లక్ష్మి, కరుణాకర్‌రెడ్డి, ఆ సుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:29 PM