Share News

నాణ్యమైన విద్యాభోధన కల్పించాలి

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:20 PM

ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యా ర్థులకు నాణ్యమైన విద్యాభోధన భోజనం, మౌ లిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

  నాణ్యమైన విద్యాభోధన కల్పించాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దండేపల్లి ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యా ర్థులకు నాణ్యమైన విద్యాభోధన భోజనం, మౌ లిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. శుక్రవా రం దండేపల్లి మండలం ధ్వారక ప్రభుత్వ పాఠశాలో కొనసాగుతున్న ఎస్టీ బాలుర వసతి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పను లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారు లకు పలు సూచనలు చేశారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించే విధంగా అధికా రుల సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఎస్‌ టి వసతి గృహ భవన నిర్మాణ పనులను కూ డా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. దండే పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వ కళాశాల లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచే విధం గా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు ఆదేశిం చారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్‌, అనుమలిస్‌ వారికి నిబంధన ప్రకారం నోటీసులు జారీ చేయాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా అ ధికారులు పర్యవేక్షించాలన్నారు. దండేపల్లి ప్ర భుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్య సేవలు, ఓపి రిజిష్టర్‌, వార్డు ల్యాబ్‌ మందుల నిల్వల ను పరిశీలించి, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల, వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటు ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కర్ణపేట కేజీబివి వి ద్యాలయాన్ని సందర్శించి విద్యాలయంలో కొన సాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. కస్తూర్బా విద్యాలయ సిబ్బంది సమయపాలన పాటించి బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చాలన్నారు. విదుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ విద్యా సం స్థలో విద్యార్థులకు అవరసమైన మౌలిక సదు పాయాలు కల్పించే విధంగా అధికారులు చర్య లు చేపట్టాలన్నారు. ఆయన వెంట దండేపల్లి ఎంపిడివో జేఆర్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే, ఆర్‌ఐ భూమన్న, కళాశాల అధ్యాప కులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 11:20 PM