ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:31 AM
విధ్యార్థుల సంక్షేమం దృష్ట్యా అనేక పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలను ప్ర భుత్వం ఖర్చు చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి పా ఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : విధ్యార్థుల సంక్షేమం దృష్ట్యా అనేక పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలను ప్ర భుత్వం ఖర్చు చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి పా ఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. అతి త్వరగా పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కాం ట్రాక్టరుకు తెలిపారు. విధ్యార్థులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సిబ్బందికి తెలిపారు. ఆరవ తరగతి విద్యార్థుల తో మాట్లాడి వివిధ సబ్జెక్టుల్లో వారి సామర్థ్యాలను పరిశీలించారు. జిల్లా ప రిషత్ సెకండరీ పాఠశాలలో విధ్యార్థుల హాజరు పట్టికను, పరిసరాలను ప రిశీలించి వాతావరణ పరిస్థితులు దృష్ట్య పాఠశాల అవరణ పరిశుభ్రంగా ఉంచుటకు కృషి చేయాలని సంబందిత శాఖ అధికారులకు తెలిపారు. వి ద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, నాన్యమైన విద్యను అందించడంతో పా టు, అర్థమయ్యే రీతిలో ప్రతి ఉపాధ్యాయుడు బోధనోపకరణాలతో విద్యను అందించి భవిష్యత్తులో రాణించేందుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని త్వరగా ప్రారంభిం చేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. అనంతరం అంకుశపూర్ సమీపం లోని సమతా రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి మిల్లర్లు తమ కు కేటాయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంత రం మద్దికల్ గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీ లించి ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటించి రోగాల బారిన పడకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. భూసమస్యల పరిష్కారంలో భాగంగా సాగు చేసే అర్హులైన ప్రతీ ఒక్కరికి సమస్యలు పరిష్కరించేందుకు రెవె న్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు. సర్ ప్రక్రియను వేగవంతం చేసి అ ర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని తహసీ ల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందించిందని, నిర్దేశి త విస్తీర్ణంలో వివిధ స్థాయిల్లో ఉన్న ఆన్‌లైన్‌లో నమోదు చేసి బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. ఎల్‌నినో సమస్య వల్లా వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో వీణా, కేజీబీవీ ఎస్‌వో కనకలక్ష్మీ, సర్పంచులు ఉన్నారు.