Share News

పాఠ్యాంశాల్లో క్యూఆర్‌ కోడ్‌లు

ABN , Publish Date - May 27 , 2026 | 05:17 AM

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్య సరికొత్త ముఖచిత్రాన్ని సంతరించుకోబోతోంది. విద్యార్థుల్లో పఠనాసక్తిని, సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంచేలా సరికొత్త సిలబస్‌ సిద్ధమైంది.

పాఠ్యాంశాల్లో క్యూఆర్‌ కోడ్‌లు

  • స్కాన్‌ చేస్తే వీడియో, ఆడియో పాఠాలు

  • సరికొత్త పాఠాలతో ఇంటర్‌ సిలబస్‌

  • విద్యార్థులకు చేరువగా డిజిటల్‌ లెర్నింగ్‌

  • ఏఐ, రోబోటిక్స్‌ అంశాలపై పాఠాలు

  • ఆసక్తి పెంచేలా ‘మీకు తెలుసా’ అంటూ విభిన్న అంశాలతో ప్రత్యేక బాక్సులు

  • గణితంలో రెండు కొత్త చాప్టర్లు

  • కొత్తగా అంతర్గత మూల్యాంకనం..

  • 20 శాతం మార్కులు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్య సరికొత్త ముఖచిత్రాన్ని సంతరించుకోబోతోంది. విద్యార్థుల్లో పఠనాసక్తిని, సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంచేలా సరికొత్త సిలబస్‌ సిద్ధమైంది. మారుతున్న కాలానికి తగినట్టుగా నూతన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానం, స్వయంగా ప్రయత్నిస్తూ నేర్చుకునే (ప్రాక్టికల్‌ లెర్నింగ్‌) విధానాలతో పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. తెలంగా ణ సంస్కృతి, స్థానిక భాష, ప్రాజెక్ట్‌ ఆధారిత బోధ న, క్యూఆర్‌ కోడ్‌లు, అంతర్గత మూల్యాంకన విధా నం, ‘మీకు తెలుసా? (డూ యూ నో)’ అంటూ ఆసక్తికర అంశాలతో ప్రత్యేక బాక్సులు వంటి ఆకట్టుకునే కీలక అంశాలెన్నో చేర్చారు. ఈ 2026-27 విద్యాసంవత్సరం నుంచే ఈ కొత్త సిలబస్‌ అమల్లోకి రానుంది. దీనితో ప్రభుత్వ ఇంటర్‌ విద్యా వ్యవస్థ ఆధునిక రూపాన్ని సంతరించుకోనుందని, గ్రామీణ విద్యార్థులకు డిజిటల్‌ లెర్నింగ్‌ అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

క్యూఆర్‌ కోడ్‌.. మీకు తెలుసా బాక్సులు

విద్యార్థుల్లో పాఠాల పట్ల ఆసక్తిని పెంచడం, వారికి కొత్త అంశాలను విభిన్న దృక్పథంతో పరిచయం చేయడం లక్ష్యంగా.. పాఠ్యాంశాల్లో క్యూఆర్‌ కోడ్‌లు, ‘మీకు తెలుసా..’ అంటూ బాక్సులను ప్రవేశపెట్టారు. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేస్తే.. సంబంధిత పాఠ్యాంశాలకు సంబంధించి వీడియో, ఆడి యో పాఠాలు ఓపెన్‌ అవుతాయి. విద్యార్థులు త మకు వీలైనప్పుడల్లా చూస్తూ, వింటూ నేర్చుకోగలిగేలా ఆ పాఠాలను రూపొందించారు. ఇప్పటిదాకా విడివిడిగా ఉన్న ఆడియో, వీడియో పాఠాలను సమీకృతం చేశారు. ఇక పాఠ్యాంశాల్లో సంబంధిత అంశాలకు, శాస్త్రవేత్తలకు సంబంధించిన విభిన్నమైన అంశాలతో మీకు తెలుసా అంటూ బాక్సులను ఏర్పాటు చేశారు.


కొత్తగా ప్రాక్టికల్స్‌, అంతర్గత మూల్యాంకనం

భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌ ప్రవేశపెట్టారు. వీటికి 15 మార్కుల చొప్పున ఉంటాయి. ఇక ప్రతి సబ్జెక్టులో కొత్తగా ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ కింద విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా 20ు మార్కులు ఇస్తారు. తెలుగు,ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్‌, ఫ్రెంచ్‌, మరాఠీ భాషాశాస్త్రాల్లోనూ అంతర్గత మూల్యాంకనం కింద 20మార్కులు ఇస్తారు. ఫిజిక్స్‌లో 20 మార్కులు, రసాయన, వృక్ష, జంతుశాస్త్రాల్లో 15 చొప్పున, ఎకనామిక్స్‌, చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ, కామర్స్‌, అకౌంటెన్సీలలో 20మార్కుల చొప్పున, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీలో 10మార్కులు అంతర్గతమూల్యాంకనంలో ఇస్తారు.

  • ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పాఠ్యపుస్తకాన్ని సమగ్రంగా మార్చారు. తెలుగు పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, పండుగలు, జానపద కళలు, ప్రముఖ వ్యక్తుల చరిత్రకు ప్రాధాన్యత ఇచ్చారు.

  • గణితంలో ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తల పరిచయాలు, క్యూఆర్‌ కోడ్లు, అంతర్జాతీ య ప్రమాణాల ఆధారిత కార్యకలాపాలు చే ర్చారు. పేజీలను గణనీయంగా తగ్గించారు. అ లాగే ‘సెట్స్‌ అండ్‌ రిలేషన్స్‌’, ‘సీక్వెన్సెస్‌ అండ్‌ సి రీస్‌’ వంటి కీలక అధ్యాయాలను మళ్లీ చేర్చారు.

  • భౌతికశాస్త్ర పుస్తకాల్లో ఫిజిక్స్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనే కొత్త పాఠాన్ని ప్రవేశపెట్టారు. దీనితో విద్యార్థులకు కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, పునరుత్పాదక శక్తి, అంతరిక్ష విజ్ఞానం, కమ్యూనికేషన్‌లపై అవగాహన కల్పించనున్నారు.

  • జాగ్రఫీలో సిలబ్‌సను 6 యూనిట్లుగా, 18 చాప్టర్లుగా కుదించారు.

  • రసాయన, వృక్ష, జంతుశాస్త్ర పుస్తకాలను మారి న ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. శాస్త్రవేత్తల వివరాలు, కొత్త పదాలు, కొత్త అధ్యాయాలు, చిత్రాలను చేర్చడం ద్వారా పాఠ్యాంశాలను మరింత సులభతరం చేశారు.

Updated Date - May 27 , 2026 | 05:17 AM