పుష్పక్ ఏసీ బస్సుల్లో 40శాతంచార్జీల తగ్గింపు
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:07 AM
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో చార్జీలను 40 శాత ం వరకు తగ్గించినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంచూరి శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో చార్జీలను 40 శాత ం వరకు తగ్గించినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంచూరి శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తగ్గించిన చార్జీలు బుధవారం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి గచ్చిబౌలికి పుష్పక్ బస్సులో చార్జీ రూ. 350 వసూలు చేస్తుండగా రూ.250కు తగ్గించారు. లింగంపల్లి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ. 350 చార్జీ ఉండగా 200కు, అల్విన్ ఎక్స్‌రోడ్ నుంచి 350 చార్జీ ఉండగా రూ. 200కు తగ్గించారు. కొత్తగూడ, గచ్చిబౌలి, శిల్పారామం నుంచి ఎయిర్‌పోర్టుకు రూ. 300 చార్జీలుండగా వాటినీ రూ.150కి తగ్గించారు.