భక్తులకు సౌకర్యంగా పుష్కరఘాట్లను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:56 PM
గోదావరి పుష్కరాలు 2027లో భాగంగా భక్తులకు సౌకర్యవంతంగా పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు పట్టణంలోని పుష్కరఘాట్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు.
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
చెన్నూరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : గోదావరి పుష్కరాలు 2027లో భాగంగా భక్తులకు సౌకర్యవంతంగా పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు పట్టణంలోని పుష్కరఘాట్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పుష్కరఘాట్‌కు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలె త్తకుండా పార్కింగ్ సౌకర్యాలు విస్తరించాలని, వాహనాల రాకపోకలు సుల భంగా జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఘాట్ల పరిసర ప్రాంతాల్లో శుభ్రత, తాగునీరు, లైటింగ్ భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం అక్కెపల్లి గ్రామంలోని నర్సరీ ని, కంపోస్టుషెడ్, వైకుంఠదామాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. శివలింగాపూర్‌లో ఉపాధి హామీపనులను పరిశీలించి కూలీలకు తగిన సౌ కర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిం చి త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. ప్రాథమిక పా ఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టి కాహారం అందించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ, చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, సర్పంచు కల్పన, వార్డు సభ్యులు, కార్యదర్శి సిరాజుద్దీన్ ఉన్నారు