శుద్ధ..అబద్ధం
ABN , Publish Date - May 28 , 2026 | 11:28 PM
వేసవి ఎండలు మండుతున్నాయి....గొంతు తడుపుకోవడానికి ప్రజలు ప డరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొ నుక్కోవాల్సిన పరిస్థితి...ప్రజల అవసరాన్ని ఆసరా చే సుకొని కొందరు నీళ్ల దందాకు శ్రీకారం చుడుతున్నా రు.
మినరల్ వాటర్ పేరుతో బోరు నీళ్లు అమ్మకాలు
-పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు
-నిబంధనలకు తిలోదకాలు
-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
మంచిర్యాల, మే 28 (ఆంధ్రజ్యోతి): వేసవి ఎండలు మండుతున్నాయి....గొంతు తడుపుకోవడానికి ప్రజలు ప డరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొ నుక్కోవాల్సిన పరిస్థితి...ప్రజల అవసరాన్ని ఆసరా చే సుకొని కొందరు నీళ్ల దందాకు శ్రీకారం చుడుతున్నా రు. ఇష్టారాజ్యంగా శుద్ధజల ప్లాంట్లను నెలకొల్పుతు న్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినరల్ వాటర్ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అందినకాడికి దం డుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ చూడ నట్లు వ్యవహరిస్తున్నారు.
మినరల్ వాటర్ పేరుతో...
మినరల్ వాటర్ పేరుతో కొంతమంది వ్యాపారులు మామూలు నీటిని సరఫరా చేసి అక్రమంగా డబ్బు సంపాదనకు తెరలేపారు. వేసవి కాలంలో మినరల్ వాటర్ (బోరు నీరు) ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్నాయి. బోరు నీటికి కొన్ని రసాయనాలు కలిపి మి నరల్ వాటర్ పేరుతో అమ్మకాలు జరుపుతున్నా పట్టిం చుకునే వారులేరు. జిల్లాలో ఎలాంటి అనుమతులు తీ సుకోకుండా చాలా మంది మినరల్ వాటర్ వ్యాపారు లు బహిరంగంగా నీటిని విక్రయిస్తున్నారు. అయినా అ ధికారుల దృష్టికి రాకపోవడం అనుమానాలకు తావి స్తోంది. జిల్లా కేంద్రంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ల లో అనేక వాటికి అనుమతులు లేవని తెలుస్తోంది. ప ట్టణంలో దాదాపు 50 వరకు ప్లాంట్లు ఉండగా, ఎక్కడా కూడా నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు.
నిబంధనలు ఇవీ...
ఆధునిక యంత్రాల సహాయంతో నీటిని మూడు దశల్లో మినరల్ వాటర్‌గా తయారు చేయాల్సి ఉంటుం ది. ముందుగా నీటిని క్లోరినేషన్ చేస్తారు. క్లోరినేషన్ చే సిన నీటిని ప్రత్యేకమైన శాండ్ ఫిల్టర్ ద్వారా వడ బోసి కార్బన్, మైక్రాన్ ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేయాల్సి ఉం టుంది. తరవాత మరో కంపార్ట్‌మెంట్‌లోకి నీటిని పం పి అలా్ట్ర వైలెట్, ఓజోనైజేషన్ ప్రక్రియ ద్వారా ఎటు వంటి సూక్ష్మ క్రిములు లేకుండా మార్చాల్సి ఉంటుంది. చివరి దశలో ఆక్సీజన్ పంపడం ద్వారా ఆక్సీకరణ జ రిపి రంగు, రుచి, వాసన లేకుండా శుద్ధి చేయాలి. అ నంతరం ప్రతీ లీటర్ నీటిలో 75 ఎంఎల్ కాల్షియం, 35 ఎంజీ మెగ్నీషియం, 0.3 ఎంజీ ఐరన్ ఉండేలా చూ డాలి. క్లోరైడ్ ఒక మిల్లీగ్రామ్ మించకుండా జాగ్రత్తలు వహించాలి. ఇలా తయరు చేసిన నీరు వారం రోజుల లోపు వినియోగించాలి. ప్రతీ ఆర్‌వో ప్లాంట్‌లో ఆహార కల్తీ తనిఖీ భారత ప్రమాణ సంస్థ (ఐఎస్‌ఐ)లోని 145, 43 సెక్షన్‌ల కింద రిజిస్టర్ కావాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితం కావడం గమనా ర్హం. పెళ్లిళ్లు, ఇతర కార్యాలలో వాటర్ క్యాన్‌ల విని యోగం పెరిగిపోవడంతో వ్యాపారులు బోరు నీటిని వ్యాన్లలో నింపి అందులో కొన్ని రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కానరాని తనిఖీలు...
అక్రమ నీటి వ్యాపారం సంబంధిత అధికారులకు తెలిసినా తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని ప్లాంట్లు నిర్వహి స్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీ స్తోంది. జిల్లాలో 400 పై చిలుకు మినరల్ వాటర్ ప్లాంట్లు, ఆర్‌వో ప్లాంట్ల పేరుతో నీటి విక్రయాలు జరు గుతున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న గదిలో నిర్వాహ కు లు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్లాం ట్లలో తయారు చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌కు రూ. 20, కూల్ వాటర్ అయితే రూ. 40 చొప్పున విక్రయా లు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం మినరల్ వా టర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పెట్టుబడి అవ స రం ఉంటుంది. అయితే చాలా మంది తక్కువ ఖర్చు తో నిబంధనలకు విరుద్దంగా మినరల్ వాటర్, ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం చేస్తున్నారు.
అనారోగ్యాలకు మూలం...
అనారోగ్యాలకు ప్రధాన కారణం తాగునీరేనని వైద్యు లు చెబుతుంటారు. కాచి, వడబోసి తాగమని సలహా ఇస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా మినరల్ వా టర్ పేరుతో సాధారణ జలాన్ని ప్రజలకు అందిస్తు న్నారు. కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా చేరడం మూ లంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మి నరల్ వాటర్ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో ఫం గస్ చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పూ ర్తిగా శుభ్రం చేయని నీటిలో ఈకొళి బ్యాక్టీరియా, కోళీ ఫార్మా ఎక్కువగా ఉండటం అనారోగ్యానికి కారణం అ వుతుంది. వీటివల్ల టైఫాయిడ్, కామెర్లు, అతిసారం, క డుపుమంట, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవ కాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అనుమతులు లేకుం డా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.