Share News

మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:53 AM

రైతులు పండిచిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర అందిం చేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు. సోమవారం తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు

మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు
వరిధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌

తంగళ్లపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంఽధ్రజ్యోతి): రైతులు పండిచిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర అందిం చేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు. సోమవారం తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. అలాగే కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌, నీటి వసతి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ధాన్యం తేమ శాతం పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ జిల్లా వ్యాపం్తంగా రైతుల సౌకర్యం కోసం ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఇతర శాఖల ఆధ్యర్యంలో మొత్తం 239 కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయా లని, సరైన తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయా లని ఆదేశించారు. ధాన్యం సేకరణపై ఇప్పటికే మార్కెటింగ్‌, పౌర సరఫరాల శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా వ్యవసాయ అధికారి, సహకార శాఖ అధికారి, రైస్‌ మిల్లర్లు, టాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కొను గోలుకు కావాల్సిన ఎలకా్ట్రనిక్‌ యంత్రాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వేసవి నేపథ్యంలో రైతుల కోసం టెంట్లు, నీటి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఆందుబాటులో ఉంచాలని అధికా రులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, మార్మెట్‌ కమిటీ చైర్మన్‌ వెల్ముల స్వరూప తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేరెళ్ల నర్సింగం గౌడ్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో గీత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఆఫ్జల్‌ బేగం, తహశీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:53 AM