Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:44 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా చేస్తుందని బడుగు బలహీనవర్గాల లక్ష్యంగా పని చేస్తు న్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
. సమావేశంలో మాట్లాడుతున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌

ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌

జన్నారం, జూలై16 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా చేస్తుందని బడుగు బలహీనవర్గాల లక్ష్యంగా పని చేస్తు న్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాల న్నారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పని చేస్తుందని మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక తీసుకుంటే అటవిశాఖ అధికారులు అడ్డుకోవడం సరికాదని కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తిలేదని అన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని అటవిశాఖ అధికారుల అతిని తగ్గించుకోవాలని అన్నారు. మండలంలోని గ్రామాల్లో కనీసం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలన్న అభివృద్ధి కోసం వేసుకునే బాటలకు ఇసుకను అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు. అనంతరం సీ ఎంఆర్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు కాం గ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గం లక్ష్మినారాయణ, మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్ర శేఖర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఫసియుల్లా, మండల ఽఅధ్యక్షులు నందు నాయక్‌, మాణిక్యం, నాయకులు మోహన్‌ రెడ్డి, ఇసాక్‌, ముజాఫర్‌ అలీ, శంకరయ్య, మామిడిపెల్లి ఇంధయ్య, సోహెల్‌లతోపాటు రావు శంకర్‌తో పాటు జక్కు సుష్మ భూమేశ్‌ తో పాటు సుభాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:44 PM