Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 17 , 2026 | 11:24 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ల క్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, మే 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ల క్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నియోజ కవర్గంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు దశల వారీగా అందిస్తా మని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజ కవర్గంలోని పలువురికి మంజూరైన సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అ నంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శృతీ లయ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస వి నృత్య శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్కృతి, సంప్ర దాయాలను కాపాడడానికి కళలు దోహదప డుతాయని పేర్కొన్నారు. అనంతరం నిర్వహిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ షాన వాజ్‌ఖాన్‌, నాయకులు చిమ్ముల శ్రీకాంత్‌ రెడ్డి, పి.రమాకాంత్‌రెడ్డి, రాహుల్‌, కొండల్‌, శృతీల య అకాడమీ అధ్యక్షులు చిత్తరంజన్‌, పలువు రు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:24 PM