Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2026 | 11:27 PM

కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌, ప ర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కొల్లాపూర్‌లో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- అవినీతికి తావు లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌, ప ర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు స్పష్టం చేశారు. పట్టణంలోని మెహబూ బ్‌ ఫంక్షన్‌ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ... ఆయ న గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. మన ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివ రించారు. ప్రతీ గ్రామంలో మౌలిక వసతుల క ల్పనకు నిధులు మంజూరు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయా లని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారద ర్శకంగా పథకాలను ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. వివిధ గ్రామాలకు చెందిన ల బ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షా దీ ముబారక్‌ చెక్కులు పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో భన్సీలాల్‌, వివిధ మండలాల తహసీల్దార్‌లు, వివిధ శాఖల అధికారులు ని యోజకవర్గ స్థాయి స్థానిక ప్ర జాప్రతినిధులు గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకు లు పాల్గొన్నారు.

ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలి

పెంట్లవెల్లి, (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవస్వామినగర్‌ గ్రామంలో మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జటప్రోలులో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశిం చారు. మూడు కోట్లతో జరుగుతున్న మదనగో పాలస్వామి ఆలయ అభివృద్ధి పనులను మం త్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పం చులు కేతూరి ధర్మతేజ, కంటే వెంకట స్వామి, పద్మమ్మ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గోపీనా యక్‌, నాయకులు రామన్‌గౌడ్‌, నల్లపో తుల గోపాల్‌, గోవింద్‌గౌడ్‌, నరసింహయాదవ్‌, మో త్కూరు నాగిరెడ్డి, కోట్ల సురేందర్‌, ఎర్రశ్రీను, భీంరెడ్డి, ఆసిఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:27 PM