Share News

kumaram bheem asifabad- ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:23 PM

ప్రజాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. సీఎం రెవంత్‌రెడ్డి నేనృత్వంలోని ప్రజాపాలన నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మండలంలోని బంబార గ్రామానికి చెందిన జాడి కిషోర్‌, చునార్‌కార్‌ రాజేశ్వర్‌, రామారావు, ఖోబ్రగడే వసంత్‌ హైదరాబార్‌ వరకు నిర్వహిస్తున్న పాద యాత్రను శుక్రవారం ఆమె ప్రారంబించారు.

kumaram bheem asifabad- ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం
పాదయాత్రను ప్రారంభిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

వాంకిడి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. సీఎం రెవంత్‌రెడ్డి నేనృత్వంలోని ప్రజాపాలన నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మండలంలోని బంబార గ్రామానికి చెందిన జాడి కిషోర్‌, చునార్‌కార్‌ రాజేశ్వర్‌, రామారావు, ఖోబ్రగడే వసంత్‌ హైదరాబార్‌ వరకు నిర్వహిస్తున్న పాద యాత్రను శుక్రవారం ఆమె ప్రారంబించారు. ఈ సందర్భంగా ు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని ఆక్షాంక్షిస్తూ బంబార గ్రామానికి చెందిన కార్యకర్తలు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా పలనకు మద్దతుగా కార్యకర్తలు చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. అనంతరం పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బంబార సర్పంచ్‌ కృష్ణాజీ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, నాయకులు మండోకర్‌ అనిల్‌, గణేష్‌, పెంటు, విలాస్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:23 PM