Share News

ఆయురారోగ్యాలతో ప్రజా సేవ చేయాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:36 PM

నాగర్‌కర్నూల్‌ ఎంపీ, టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మల్లు రవి 76వ జన్మదినవేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా జరిగాయి.

ఆయురారోగ్యాలతో ప్రజా సేవ చేయాలి

- ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకల్లో నాయకులు

నాగర్‌కర్నూల్‌/కల్వకుర్తి/ వెల్దండ/ తెలకపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ ఎంపీ, టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మల్లు రవి 76వ జన్మదినవేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా జరిగాయి. నాగర్‌క ర్నూల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వంకే శ్వరం నిరంజన్‌ ఆధ్వర్యంలో జరిగిన మల్లు రవి జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి సంబురాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా వంకేశ్వరం నిరంజన్‌ మాట్లాడుతూ మల్లు రవి ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో కొనసాగాలని ఆయన ఆకాం క్షించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్స న్‌ తీగల సునేంద్ర, వైస్‌ చైర్మన్‌ బాదం రమేష్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ హ బీబ్‌, కౌన్సిలర్లు ఎండీ నిజాం, పద్మమ్మ పాల్గొ న్నారు. ఫ కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌కుమార్‌, డీసీ సీ అఽధికార ప్రతినిధి చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, ప ట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్‌, మార్కెట్‌ డై రెక్టర్‌ పసుల రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ డాక్టర్‌ మల్లు రవి జన్మదిన వేడుకలు నిర్వహిం చారు. ప్రధాన చౌరస్తాలో బాణసంచా కాల్చి, కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఫ వెల్దండలో డీసీసీ ఉపాద్యక్షుడు భూపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి మోతీలాల్‌, మండలకాంగ్రెస్‌ అధ్యక్షుడు హరికిషన్‌నాయక్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి జన్మదిన వేడుకలు నిర్వహిం చారు. కేక్‌కట్‌చేసి స్థానికులకు పంచిపెట్టారు. ఫ తెలకపల్లిలో స్థానిక సర్పంచ్‌ కొమ్ము చంద్ర శేఖర్‌, సింగిల్‌విండో మాజీ వైస్‌ చైర్మన్‌ మామి ళ్లపల్లి యాదయ్య ఆధ్వర్యంలో మల్లు రవి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

Updated Date - Jul 14 , 2026 | 11:36 PM