kumaram bheem asifabad- లక్ష మందితో బహిరంగ సభ
ABN , Publish Date - May 31 , 2026 | 11:10 PM
జిల్లాకు మొట్ట మొదటి సారిగా వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ చరిత్రలో నిలిపోయేలా లక్ష మందితో నిర్వహిస్తామని మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే, సీఎం సభ కన్వీనర్ ప్రేంసాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ అతిథి గృహంలో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, ఏఎంసీ చైర్మన్ మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ కన్వీనర్ శ్యాంనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు
ఆసిపాబాద్‌రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మొట్ట మొదటి సారిగా వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ చరిత్రలో నిలిపోయేలా లక్ష మందితో నిర్వహిస్తామని మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే, సీఎం సభ కన్వీనర్ ప్రేంసాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ అతిథి గృహంలో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, ఏఎంసీ చైర్మన్ మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ కన్వీనర్ శ్యాంనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి సారిగా జిల్లాకు వస్తున్న సీఎంకు ఘన స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభను తలపించేలా సభ నిర్వహిస్తున్నట్లు, లక్ష మందిని ఉమ్మడి జిల్లా నుంచి తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామి నెరర్చమని ప్రతి పక్ష బీఆర్‌ఎస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ పార్టీ మెనిఫెస్టో చెడితే వారు ఉరేసుకుని చస్తారని ఆరోపించారు. జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన కుమరం భీం, జగన్నాథ్‌పూర్, వట్టివాగు, ఎర్రవాగు, ప్రాజెక్లుకు తటెట్టడు మట్టి కూడా గత ప్రభుత్వం పోయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఉపాధి హామి పథకాన్ని బీజేపీ భ్రష్టు పట్టించిందని, 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం ఇవ్వాలని కొత్త నిబంధనలు తెచ్చి కూలీల్కఉ ఇబ్బందులు కలిగేలా చేస్తుందన్నారు. పెడరల్ వ్యవస్థకు బీజేపీ తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేసేది కాదన్నారు. ఆదిలాబాద్- ఉట్నూర్ నాలుగు వరుసల రహదారి, అనార్‌పల్లి, గుండి వంతెనలకు నిధుల కోసం ముఖ్యమంత్రిని ఒప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తారీక్, బాలేష్‌గౌడ్, మల్లేష్, మహేష్‌గౌడ్, శంకర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.