Share News

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:31 PM

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాఽ దాన్యమని అందుకోసమే జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి ని ర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివా రం కాలేజీ రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం,ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాఽ దాన్యమని అందుకోసమే జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి ని ర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివా రం కాలేజీ రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. నిర్మాణ పనులను పురోగతిని, నాణ్యత ప్రమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు త్వరలోనే ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదే శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్య మని ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటు లోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ ధర్ని మధూకర్‌, అధికా రులు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతీ విద్యార్థికి పోషక విలువలతో కూడిన ఆహారం అందాలి

ప్రభుత్వ పాటశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువ లతో కూడిన ఆహారం అందించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కాలేజీ రోడ్డులో పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులకు టిపిన్‌, మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే క్రిష్ణ మూ మెంట్స్‌ చారిట్రబుల్‌ ట్రస్టు(ఇస్కాన్‌ సంస్థ) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ నిర్మాణ పనులను ఆయన పరిశిలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంట శాల నిర్మాణ పూర్వపు గదిని, ఆ హార తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార నిల్వ, ప్యాకింగ్‌ పంపిణీ వ్యవస్థలపై అధికారులతో పాటు సంస్థ ప్రతినిధులను అడిగితెలు సుకున్నారు. విద్యార్థుల కోసం మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవా దాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, మేయ ర్‌ ధర్ని మధూకర్‌, ఇస్కాన్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:31 PM