Share News

పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:21 PM

పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక మూడవ వార్డు చతలాపూర్‌లోని డంపింగ్‌యార్డును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా నిర్వహించాలన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం
కమీషనర్‌తో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మందమర్రిటౌన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక మూడవ వార్డు చతలాపూర్‌లోని డంపింగ్‌యార్డును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా నిర్వహించాలన్నారు. రహదారుల పక్కన చెత్తా, చెదారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వార్డుల వారీగా చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. వార్డులను శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమీషనర్‌ రాజలింగు, సిబ్బంది పాల్గొన్నారు.

-రహదారి పనులను పరిశీలించిన కలెక్టర్‌

తిమ్మాపూర్‌ వద్ద ఆర్మూర్‌ నుంచి చంద్రపూర్‌ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 63 పనులను గురువారం జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:21 PM