ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:18 PM
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు ప్ర భుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు.
- పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు ప్ర భుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టర్ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తూడుకుర్తి గ్రామ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్‌పేషెంట్ విభా గం, జనరల్ వార్డులు, ఫార్మసీల్యాబ్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరా లను అడిగి తెలుసుకుని అటెండెన్స్ రిజి స్టర్‌ను తనిఖీ చేశారు. ప్రతీ రోజు ఎంతమంది రోగులు వస్తున్నారు, స్థానికంగానే ప్రసవాలు జరుగుతు న్నాయా అనే విషయాలపై సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అంకితభావంతో పని చేయాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. అ నంతరం అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని పరిశీలిస్తూ నా ణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.