ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:13 AM
ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అలాగే ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అలాగే ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులను కలిసి సమస్యలను విన్నవించారు. ప్రజావాణిలో 253ఫిర్యాదుల వచ్చాయి. ఇందులో రెవెన్యూకు 67, జిల్లా గ్రామీణాభివృద్దికి శాఖకు 64, గృహా నిర్మాణశాఖు 46, జిల్లా పంచాయితీ అధికారికి 13, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 9, జిల్లా విధ్యాధికారికి 6, జిల్లా సంక్షేమాధికారికి 5, నీటి పారుదల శాఖకు 4, ఎన్‌పీడీసీఎల్‌కు 4, ఎన్‌డీసీకి 4, జిల్లా పంచాయతీరాజ్‌శాఖకు 4, పౌరస రఫరాల అధికారికి 3, జిల్లా వైధ్యాధికారికి 3, సిరిసిల్ల ము న్సిపల్ కమిషనర్‌కు 3, జిల్లా అటవీశాఖ అధికారికి2, సబ్‌రిజిస్టార్‌కు 2, సిరిసిల్ల జనరల్ హాస్పిటల్‌కు 2, చేనేత జౌళీశాఖకు1, జిల్లా వ్యవసాయశాఖ అధికారికి 1, జిల్లా మైనార్టీ సంక్షేమా ధికారికి1, జిల్లా ఉద్యానవన అధికారికి 1, జిల్లా మైనింగ్ శాఖకు 1, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖకు 12, పౌరసంబంధాల అధికారికి1, అర్‌అండ్ బీ ఈఈకి 1, మిషన్ భగీరథకు 1, వేములవాడ మున్సిపాలిటీకి1, ఎస్పీ కార్యాలయా నికి 1 చొప్పున ఫిర్యాదులు రావడంతో వీటిని సం బంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజావా ణిలో ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరి ష్కరించారనే తెలుసుకున్నారు. ప్రజావాణిలో సిరిసిల్ల అర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు ఉన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూర్ శివారులో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూంల సముదా యంలో ఎలాంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండానే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నీటి సమస్య అధికంగా ఉందన్నారు. అలాగే చెత్తసేకరణ లేకపోవడంతో పాటుశానిటేషన్ సమస్యలు అధికంగా ఉన్నాయని అలాగే రేషన్‌దు కాణంతోపాటు అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ స్పందించాలంటూ పెద్దూర్‌డబుల్ బెడ్‌రూం లబ్ధిదా రుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో పలువురు జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి వినతి పత్రాన్నిఅందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రచ్చ రాహూల్, ఎస్‌కె నసీర్; భూక్య సురేష్‌నాయక్ పాల్గొన్నారు.
రగుడు చెరువులో నీరు నింపాలి
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రగుడు శివారులోని దేవునికుంట, మైసమ్మకుంట, చెరువులల్లోకి మల్క పేట రిజర్వాయర్ నుంచి నీటి నింపాలంటూ రగుడు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బూర యాదగిరి కోరారు. రగుడు గ్రామానికిచెందిన అభివృద్ది కమిటి అధ్వ ర్యంలో యువకులు తరలివచ్చి జిల్లా అదనపుకలెక్టర్ గడ్డం నగేష్‌ను కలిసి వినతి పత్రాలను అందించారు. కార్యక్రమంలో దొంతుల చంద్రం, వంగ నరేష్, ఏశ సాయిదీప్, ఏశ ప్రశాంత్, బండి అభిలాష్ ఉన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడాలి
వేములవాడ మండలంలోని కొడిముంజ అర్‌అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వ భూములను ప్రైవే టు వ్యక్తులకు గ్రామపంచాయతీ తీర్మాణం పేరుతో అప్పగిస్తున్నారని కలెక్టర్ విచారణ జరిపించాలంటూ గ్రామానికి వార్డు సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వ భూములను కాపాడాలని వార్డు సభ్యులు లావణ్య, రాజేశ్వర్‌రావు, హరీష్‌లు కోరారు.