ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక.. సమర్ధవంతంగా అమలు చేయాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:24 PM
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా ఇన్‌చార్జీమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా ఇన్‌చార్జీమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించామన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ,జిల్లా, రాష్ట్రస్థాయిలో కార్యచరణ అమలు చేయాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పారిశుధ్య్దంపై ప్రత్యేక దృష్టి సారించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ఫైల్ల్ క్లియరెన్స్,ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, వ్యవసాయ, విద్య, విద్యుత్, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్దం చేసి దశల వారీగా పూర్తిచేయాలని తెలిపారు. వేసవి దృష్య్టా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లా వారీగా, శాఖల వారీగా నివేదికలు సిద్దం చేసి ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 99 రోజులకు గాను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. శుక్రవారం నుంచి పారిశుధ్య ప్రక్రియ ప్రారంభించామని, భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్‌సింగ్, అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య,శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ మనోజ్, మేయర్ మధుకర్, డిప్యూటి మేయర్ రమ్య, అధికారులు, మున్సిపల్ చైర్మన్‌లు పాల్గొన్నారు.