Share News

Old Pension Scheme: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం ఇవ్వాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:05 AM

కేంద్రప్రభుత్వం ఇచ్చిన మెమో నెం.57 ద్వారా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపజేయాల...

Old Pension Scheme: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం ఇవ్వాలి

కేంద్రప్రభుత్వం ఇచ్చిన మెమో నెం.57 ద్వారా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపజేయాలని పీఆర్‌టీయూటీఎస్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి నేతృత్వంలోని పీఆర్‌టీయూటీఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్‌ నేతృత్వంలోని ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూటీఎస్‌ 2026 సంవత్సరపు డైరీని సీఎం ఆవిష్కరించారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలని, పూర్తిస్థాయి పర్యవేక్షణ అధికారులను నియమించడం వల్ల విద్యావ్యవస్థ మెరుగుపడుతుందని నివేదించారు. తాము నివేదించిన అంశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటానని సీఎం తెలిపారని ప్రతినిధులు గుర్తుచేశారు.

Updated Date - Jan 06 , 2026 | 02:05 AM