పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం రేట్లు పెంచండి
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:32 AM
పదో తరగతి పరీక్ష పత్రా ల మూల్యాంకనం రేట్లను పెంచాలని పీఆర్టీయూ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి...
సీఎం రేవంత్‌రెడ్డికి పీఆర్టీయూ విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష పత్రా ల మూల్యాంకనం రేట్లను పెంచాలని పీఆర్టీయూ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్‌లు వినతిపత్రం సమర్పించారు. 2018 నుండి పదో తరగతి మూల్యాంకనం ధరలను పెంచలేదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరించాలని కోరారు. అలాగే ఆధార్ అనుసంధానంలో సాంకేతిక లోపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల జీతాలు అందలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతులపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను వెంటనే పరిశీలించి, తగిన పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.