ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:16 PM
ఆస్పత్రికి వ చ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సే వలు అందించాలని ఎమ్మెల్యే డా క్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నా రు.
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్‌రెడ్డి
- బొప్పల్లి పీహెచ్‌సీ తనిఖీ
కందనూలు/ తెలకపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఆస్పత్రికి వ చ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సే వలు అందించాలని ఎమ్మెల్యే డా క్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం బొప్పల్లిలోని ప్రా ఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, అవుట్ పేషంట్ విభాగం, మందుల నిల్వలు, ప రిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు రోగులకు అం దుతున్న చికిత్స తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నే రుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవ లపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నాగేశ్వరి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపుతూ సరిపడా సిబ్బంది లేరని చెప్పారు. ఎమ్మెల్యే జిల్లా వైద్యా ధికారితో ఫోన్‌లో మాట్లాడి వీలైనంత తొంద రగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ నాగే శ్వరి, సిబ్బంది, సర్పంచ్ నవ్య మల్లాచారి పా ల్గొన్నారు. అనంతరం బొప్పల్లి గ్రామంలో ఇటీ వల రోడ్డు ప్రమాదానికి గురైన అల్వాల బాల చంద్రయ్యను ఎమ్మెల్యే శుక్రవారం బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
వట్టిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం
తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో శు క్రవారం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. గ్రామంలో ఒకే రోజు 9 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్ర మంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజినేప ల్లి, తెలకపల్లి, తాడూరు, నాగర్‌కర్నూల్ మండ లాల్లోని 241 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్ర జల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని అన్నారు. కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తాడూరు మండల అధ్యక్షుడు యార రమేష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు వినోద్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్క రాజ్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మునిసిపల్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.