kumaram bheem asifabad- భావితరాలకు పచ్చదనం అందించాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:23 PM
భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కె హరిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెంచికలపేట రేంజ్ కార్యాలయ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఎఫ్‌డీఓ అప్పయ్య, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అడవుల పెంపకం, మొక్కల సంరక్షణ అత్యంత అవసరమనప్నారు. ఆస్తులు ఇవ్వక పోయినా భావితరాలకు పచ్చని ప్రకృతి, స్వచ్చమైన గాలిని అందించే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
పెంచికలపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కె హరిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెంచికలపేట రేంజ్ కార్యాలయ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఎఫ్‌డీఓ అప్పయ్య, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అడవుల పెంపకం, మొక్కల సంరక్షణ అత్యంత అవసరమనప్నారు. ఆస్తులు ఇవ్వక పోయినా భావితరాలకు పచ్చని ప్రకృతి, స్వచ్చమైన గాలిని అందించే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. అనంతరం అటవీ ప్రాంతంలోని అరుదైన శిలాజాలను(వుడ్ పాసిల్స్) పరిశీలించారు. చారిత్రక, శాస్త్రీయ ప్రాధాన్యత కలిగిన ఈ శిలాజాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నిర్మూలనపపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ విడుదల చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో అనీల్‌కుమార్, తహసీల్దార్ రవీందర్, సర్పంచ్‌లు, రాంచందర్, ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరనాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జిల్లా అటవీ అధికారి బాలామణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంవదర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం కుశ్నపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని రాముడు భీముడు టేకు చెట్లను పరిశీలించి బేక్ క్యాంపును సందర్శించార ఆమె వెంట ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్వో శ్రావణ్‌కుమార్, సెక్షన్ అధికారులు సాఫియా బేగం, సంతోష్, మనోహర్ తదితరులు ఉన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వి సంకేత్ మిత్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, సెకం డ్ క్లాస్ మెజిస్ట్రేట్ అమృత్‌పాల్ కౌర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్‌బాబు, ఆర్‌పీ ఎం.శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఎం.సురేష్, టి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిర్పూరు(టి) ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ ఉల్లం అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రామన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్, కోర్టు ఇన్‌చార్జి సూపరిటెండెంటెండ్ ప్రశాంత్, డిప్యూటీ రేంజ్ అధికారులు ప్రవీణ్ కుమార్, తిరుపతి, సెక్షన్ అధికారులు తులసీదాస్,మోహన్‌రావు, వరుణ్, అక్తర్, రజిత, కోర్టు సిబ్బంది, బీట్ అధికారులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణే అందరి ధ్యేయం కావాలని కాగజ్‌నగర్ టీజీఎఫ్‌డీసీ మేనేజర్ గణేష్ తెలిపారు. పర్యావరణ దిన్సోతవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) కాగజ్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పలు కూడళ్ల మీదుగా సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మేనేజర్ గణేశ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అంతా సహకరించాలన్నారు. ప్లాస్టిక్ వాడకుండా చూడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు గోగు సురేష్, జలపతి, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, ఫీల్డు సూపర్ వైజర్‌లు, వాచర్‌లు సిబ్బంది పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతైన అవసరమని సర్పంచ్ సతీష్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ సంచాయతీ కార్యాలయ అవరణలో ఆయన మొక్కలు నాటారు కార్యక్రమంలో కార్యదర్శి శివకుమార్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): ప్రకృతిలో మమేకమవ్వాలని బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీ రమేష్ తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ, ఓసీ ఏరియా హాస్పిటల్,, తదితర డిపార్టుమెంటులో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఉజ్వల్ కుమార్ బెహరా, ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్‌ఓటు జీఎం ఎన్.ఉమాకాంత్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఇన్‌చార్జి ఎన్విరాన్మెంటు అధికారి రమేశ్, కైరిగూడ మేనేజర్ జె.శంకర్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రసాదించిన పర్యావరణాన్ని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికిపై ఉందని సర్పంచ్ జయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పలు దుకాణాలలో శుక్రవారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, కార్యదర్శి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పోలీసులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు పాలు పడాలని సర్పంచ్ సరోజ అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి మానవుడికి జీవనాధారం అని దాన్ని పరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆదర్శ్, కార్యదర్శి వైకుంఠం, వార్డు సభ్యులు రమేష్, రాకేష్, నాయకులు అమీరుద్దీన్, సురేష్‌గౌడ్, జలపతి పాల్గొన్నారు.