kumaram bheem asifabad- రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:44 PM
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబోద్‌కుమార్‌లతో కలిసి హాజరయ్యారు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబోద్‌కుమార్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి 50 పడకల నుంచి 330 పడకలకు ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంపొందించామని అన్నారు. తదనగుణంగా సిబ్బంది నియమకం, వైద్య పరికరాలను సమకూర్చనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిపుణులను నియమించి వైద్య సేవలు అందించాలని చెప్పారు. తద్వారా ఆసుపత్రికి వచ్చే ప్రజల సంఖ్య పెరిగిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆసుపత్రికి వచ్చే నిధులతో అత్యవసర ముందులు, ఆక్సిజన్, ఇతర పరికాలు కొనుగోలు వినియోగించనున్నామని చెప్పారు. ఇరత అవసరాలకు కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలోని ప్రాంతాన్ని ప్రైవేట్ మెడికల్ షాప్, జీరాక్స్, క్యాంటీన్, ఇతరత్రా ఏర్పాటు చేసుకునేందుకు నిబంధనల ప్రకారం అనుమతించాలని అన్నారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఆసుపత్రికి అవసరమైన మార్చురీ వ్యాన్, అంబులెన్స్ కోసం ఆసుపత్రినలో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నందున అవసపరమైన ఆపరేషన్ థియేటర్, పరికరాలు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కమిటీ సభ్యులు ఆమోదించారని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తనిఖీ చేపట్టి.. సిబ్బందిని అప్రమత్తం చేసి..
బెజ్జూరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో బుధవారం కలెక్టర్ కె హరిత సుడిగాలి పర్యటన చేశారు. పలు కార్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు తనిఖీ చేసి పలు సూచనలు ఇస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముందుగా మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి రోగలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, ఇతర సిబ్బంది సమయ పాలన పాటిస్తున్నారా, రోగులకు సరైన వైద్య సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సరిపడా మందుల నిలువ ఉన్నాయా, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అంటూ అడిగారు. అనంతరం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, గుడ్లు పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి రైతుల భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏపీఎం మోహన్, ఏపీవో రాజన్న, సర్పంచ్ సరోజ, ఉప సర్పంచ్ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.