Share News

kumaram bheem asifabad- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:06 AM

ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాంతో కలిసి అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాంతో కలిసి అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదని తెలిపారు. రానున్న రోజుల్లో ఎండలత తీవ్ర మరింత అధికమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు వడదెబ్బ తగలకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు అందుబాటుల ఉంచాలని, శుద్ధమైన తాగునీటిని ప్రజలకు తాగాలని వివరించాలని తెలిపారు. దోమల వ్యాప్తి చెందకుండా నివారణ చర్య లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వైద్యులు, సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రమతువున్న దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. వృద్దులు, పిల్లలు, గర్భిణులు, వ్యవసాయ, నిర్మాణ, రవాణా, పారిశుధ్య కార్మికులు ఎండ వేడిమి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో సమావేశాలు న్విహించి జిల్లాలో అమలు చేసే కార్యచరణపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అనారోగ్యాలు, ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బస్టాండ్‌, ప్రభుత్వ భవనాలు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు గాను రెడ్‌ క్రాస్‌, స్వచ్చంద సంస్థలు, సామాజిక బృందాల సహకారం తీసుకోవాలన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:06 AM