Share News

kumaram bheem asifabad- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:35 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌లను, మందుల నిలువల గదిని, ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సమయపాలన, అనుమతి లేకుండా గైర్హాజరయ్యే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

kumaram bheem asifabad- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
: వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ హరిత

పెంచికలపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌లను, మందుల నిలువల గదిని, ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సమయపాలన, అనుమతి లేకుండా గైర్హాజరయ్యే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిక, మెనూ పట్టిక, సరుకుల నిలువ గది, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని వడ్డించాలని సూచింలచారు. విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన బోధనను అందించాలని చెప్పాపరు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో బోధించాలన్నారు. అంతకు ముందు మండలంలోని బొంబాయిగూడ గ్రామంలో గల ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిని ఎంత మంది గర్భిణులు ఉన్నారని, వారిలో డెలవరీకి ఎంత మంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి క్రమం తప్పకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా శ్యాం, మామ్‌ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీయూపీఎస్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. విద్యార్థులు వంద శాతం పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. ఆమె వెంట ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 10:35 PM