kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:14 PM
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కెహరిత అన్నారు. శనివారం జిల్లాలోని దహెగాం మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువల గది, రిజిస్టర్లను, పరిసరాలను పరిశీలించారు.
దహెగాం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కెహరిత అన్నారు. శనివారం జిల్లాలోని దహెగాం మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువల గది, రిజిస్టర్లను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతై వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటించాలని, సరైన కారణం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుక0ుంటామని తెలిపారు. అనంతరం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆసుపత్రి ఆవరణలో సిబ్బందితో కలిసి ప్లాస్టిక్, వ్యర్థాలను తొలగించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిని మందలించారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాత్కాలిక ఒప్పంద పద్దతిన పని చేస్తూ విధులకు గైర్హాజరు అయిన డాటా ఎంట్రీ ఆపరేటర్ రాబోజీని విధుల నుంచి తొలగించాలని, గైర్హాజరైన ల్యాబ్ టెక్నిషియన్ సందీప్, వినోద్‌లకు షోకాజు నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను పరిశీలించారు.
రోడ్డుపై కారు నిలిపి.. విద్యార్థిని పలకరించి...
దహెగాం పర్యటనలో భాగంగా మార్గ మధ్యలో ఐనం గ్రామం వద్ద ఓ బాలుడు కనిపించడంతో కలెక్టర్ కె హరిత కారు నిలపి అప్యాయంగా పలుకరించారు. బాబు.. బడికి వెళ్తున్నావా అని ప్రశ్నించారు. బడికి వెళ్లడం లేదని బాలుడు సమాధానం ఇచ్చారు. ఎందుకు ఈ రోజు బడికి వెళ్లలేదా అని కలెక్టర్ అడుగగా తన ఒంటిపై దురద సమస్య ఉండడంతోనే పాఠశాలకు వెళ్లలేదని బాలుడు చెప్పడంతో స్పందించిన కలెక్టర్ విద్యార్థి ఆరోగ్యం గురించి తెలుసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ చదువుపై దృష్టి పెట్టాలని, విద్యతోనే మంచి భవిష్యత్ సాధ్యమవుతుందని తెలిపారు.