Share News

kumaram bheem asifabad- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:25 PM

ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, పలు విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

kumaram bheem asifabad- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, పిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, పలు విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్త నిలువ గదిని పరిశీలించి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై విచారించారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. సామాన్యులు, ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉంటారని చెప్పారు. వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించకూ డదని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. రోగులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, శుద్ధమైన తాగునీటిని అందించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య స్థితిగతులపై వైద్యు లు, సిబ్బంది ఎల్లప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సుబోద్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:25 PM