Protest Over Church Construction: హిందువుల ఇళ్ల మధ్య చర్చి నిర్మాణంపై అభ్యంతరం
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:40 AM
హైదరాబాద్ బడంగ్‌పేట్ సర్కిల్ జిల్లెలగూడ డివిజన్ లక్ష్మీనగర్ ఎన్‌క్లేవ్ కాలనీలో హిందూ కుటుంబాలు ఉన్న ఇళ్ల మధ్య చర్చి నిర్మాణ పనులు చేపట్టడంతో బుధవారం స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు...
పనులను అడ్డుకున్న బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎ్‌సఎస్ ప్రతినిధులు
హైదరాబాద్ బడంగ్‌పేట్ సర్కిల్‌లో ఘటన
సరూర్‌నగర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ బడంగ్‌పేట్ సర్కిల్ జిల్లెలగూడ డివిజన్ లక్ష్మీనగర్ ఎన్‌క్లేవ్ కాలనీలో హిందూ కుటుంబాలు ఉన్న ఇళ్ల మధ్య చర్చి నిర్మాణ పనులు చేపట్టడంతో బుధవారం స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు ఈ విషయాన్ని బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో బీజేపీ క్లస్టర్-1 అధ్యక్షుడు పసునూరి భిక్షపతిచారి ఆధ్వర్యంలో బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, ఆర్‌ఎ్‌సఎస్, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. కాలనీలో ఒక్క క్రిస్టియన్ కుటుంబం లేకున్నా చర్చి నిర్మాణం చేపడుతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిర్మాణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు. కౌన్సిల్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పెండ్యాల నర్సింహ, భీమ్‌రాజ్, పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సోమేశ్వర్, ఆర్‌ఎ్‌సఎస్ ప్రతినిధి జ్ఞానేశ్వర్, వీహెచ్‌పీ ప్రతినిధి రాజేందర్‌రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధి తిరుపతిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.