Share News

Flood victims staged a protest: కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఎదుట ముంపు బాధితుల ధర్నా

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:09 AM

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన బాధితులు....

Flood victims staged a protest: కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఎదుట ముంపు బాధితుల ధర్నా

  • మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ శ్రేణులు

మర్కుక్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుల బాధితులకు నేటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని విమర్శించారు. రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని, మెరుగైన పునరావాస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సలోనే ఉండడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షించారు.

Updated Date - Jan 05 , 2026 | 03:09 AM