Share News

ఉపాధి హామీ పథకం పేరు రద్దుపై నిరసన

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:11 PM

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసినందుకు నిరసనగా శుక్రవారం మండలంలోని బబ్బెరచెలక, దేవులవాడ గ్రామాల్లో డీసీసీ అధ్య క్షుడు రఘునాధ్‌రెడ్డి ఆధ్వ ర్యంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పథకం పేరు రద్దుపై నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు, నాయకులు

కోటపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసినందుకు నిరసనగా శుక్రవారం మండలంలోని బబ్బెరచెలక, దేవులవాడ గ్రామాల్లో డీసీసీ అధ్య క్షుడు రఘునాధ్‌రెడ్డి ఆధ్వ ర్యంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపాధిని కల్పించే ఉద్దేశ్యంతో 2004లో చట్టం తెచ్చి గ్రామీణ భా రతాన్ని పేదరికం నుంచి కాపాడగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాంజీ పథ కాన్ని తీసుకువచ్చి కేంద్రం నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తుందని వి మర్శించారు. దీని వల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్తులకు, గ్రామీణ కార్మికులకు ఉపాధి పొందడం కష్టంగా మారుతుందన్నారు. ఈ చట్టం రద్దు చేయాలని ప్రతి గ్రామంలో ఈ నెల 26న తీర్మాణాలు చేయనున్నామన్నారు. కేంద్రం చేయబోయే ప్రజా వ్యతిరేక పథకాలను దేశ వ్యాప్తంగా తమ పార్టీ విమర్శిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ మహేష్‌ ప్రసాద్‌ తివారీ, సర్పంచులు మూల ప్రదీప్‌రెడ్డి, దుర్గం సమ్మక్క, వార్డుసభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:11 PM