kumaram bheem asifabad- ఓటుహక్కును కాపాడడమే కాంగ్రెస్ లక్ష్యం
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:33 PM
భారత రాజ్యంగం పౌరులకు కల్పించిన ఓటుహక్కును కాపాడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సర్ ప్రక్రియలో ప్రతీ ఓటరు నమోదు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సర్ ఇన్‌చార్జి, మాజీ విప్ అరెపల్లి మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రియాజ్, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యంగం పౌరులకు కల్పించిన ఓటుహక్కును కాపాడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సర్ ప్రక్రియలో ప్రతీ ఓటరు నమోదు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సర్ ఇన్‌చార్జి, మాజీ విప్ అరెపల్లి మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రియాజ్, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాలో 4,55,596 మంది ఓటర్లు ఉండగా 4,07,261 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రియాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు అనేది ఆక్సిజన్‌లాంటిదని చెప్పారు. అటువంటి ఓటుహక్కును దూరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో గ్రామీణ ప్రాంత ఓటర్లు పూర్తి స్థాయిలో సహకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టిసారించమన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ వందశాతం పూర్తి చేయడానికి బీఎల్‌ఏలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అనిల్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మంగ, విశ్వనాథ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిన్న మల్లన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, పార్టీ మండల అద్యక్షుడు రాపర్తి మురళి, పట్టణ అధ్యక్షుడు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.