బాలికల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:10 PM
బాలికల సంర క్షణ కోసం ప్రభుత్వం ఆధిక ప్రాదాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అన్నారు. నస్పూర్ న్యూ సిటీ కాలనీలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా రూ. కో టి 34 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభిం చారు.
బాల సదన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే
నస్పూర్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : బాలికల సంర క్షణ కోసం ప్రభుత్వం ఆధిక ప్రాదాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అన్నారు. నస్పూర్ న్యూ సిటీ కాలనీలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా రూ. కో టి 34 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభిం చారు. నూతనంగా నిర్మించిన భవనంలోని అన్ని గదు లను పరిశీలించారు. పిల్లల సంరక్షణ బాధ్యతలు సక్ర మంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచిం చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రు లు లేని, ఆనాథ బాలికల సంరక్షణ కోసం గత ఏడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో మం జూరైనా బాల సదన్ భవనాల్లో మన నియోజక వర్గం లో ముందుగా పూర్తయి ప్రారంభం చేసుకోవడం సంతో షంగా ఉందన్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి పను ల శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. కలె క్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ బాల సదన్ భవ నంలో 60 మంది బాలికల వసతి కోసం నిర్మాణం చే శామన్నారు. బాల సదన్ భవనం పనులు త్వరితగతిన పూర్తయయ్యాన్నారు. భవనంలో 60 మంది పిల్లలకు స రిపడ ఫర్నిచర్, వసతి గదులు, మూత్రశాలలు, తదిత ర అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. వాచ్‌మెన్, వంట మనిషి, ఇతరాత్ర సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అర్హత కలిగిన పిల్లలను కస్తూర్భా గాంధీ విద్యాలయంకు పంపించి విద్యాను అందిస్తామన్నారు. బాల్య వివాహాల బాధితులు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, అనాధలు, నిరాశ్రయులు, సంరక్షణ అవ సరం ఉన్న పిల్లలను సురక్షిత ఆశ్రయం కల్పిస్తామ న్నా రు. సంరక్షణ, విద్య, వైద్య సేవలు, కౌ న్సెలింగ్, పునరా వాస సేవలు అందు తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కా ర్యక్రమంలో కార్పోరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా ర మ్య, కార్పొరేటర్లు రాచకొండ గోపా ల్ రావు, సుదమల్ల హరికృష్ణ, ఎండి కలీద్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవూఫ్ ఖాన్, చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ ఆనంద్, బాల సదన్ నిర్వాహకులు పాల్గొన్నారు.